భారతదేశం, ఫిబ్రవరి 18 -- అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కనసానివారిపల్లె గ్రామంలోని చెరువులో శవమై కనిపించాడు. మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ఉదయం నేరం వెలుగులోకి వచ్చింది.

అయితే నిందితుడు కలవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ ప్రకటించారు. నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా.. పోలీసుల నుంచి తప్పించుకున్నట్టుగా వెల్లడించారు. 'కులవర్ధన్‌ను రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా మా నుంచి తప్పించుకుని పారిపోయాడు. మూడు బృందాలతో గాలింపు చేపట్టాం. పొద్దున శవంగా తేలాడు. ఈ ఇష్యూను రాజకీయం చేసిన వారిపై కేసులు పెట్టాం.. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. దీనిపై వారి కుటుంబ...