భారతదేశం, ఫిబ్రవరి 15 -- లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. తాజాగా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో అత్యధిక కాలం పాటు ట్రెండింగ్ లో ఉన్న సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పింది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ హీరో. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ మూవీ క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైనప్పటి నుండి ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

బుక్ మై షోలో అత్యధిక కాలం పాటు ట్రెండింగ్ లో ఉన్న ఇండియన్ సిన...