భారతదేశం, సెప్టెంబర్ 5 -- సమోసాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మరి సమోసా 'క్రేవింగ్స్​' వస్తే వెంటనే 1,2 లాగించేయాలనిపిస్తుంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ మహిళకు కూడా ఇదే కోరిక పుట్టింది. సమోసాలు తీసుకురండి అని భర్తకు చెప్పింది. కానీ అతను తీసుకెళ్లలేదు. అంతే! కోపంతో భర్తను ఆమె చితకబాదింది! ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఉత్తరప్రదేశ్‌ పిలిభిత్‌ జిల్లాలోని పూరన్​పూర్​ ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సమోసా కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అనంతరం భర్తను, ఆ మహిళ కొట్టింది!

భార్య సంగీతకు సమోసా తినాలనిపించగా, భర్త శివమ్‌ను తీసుకురమ్మని కోరింది. అయితే, ఆగస్ట్​ 30న శివమ్ ఇంటికి సమోసా లేకుండానే ఒట్టి చేతులతో వెళ్లాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్షణాల్లోనే అది పెద్ద గొ...