Hyderabad, జూలై 22 -- ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాలలో ఒకటైన 'హరి హర వీర మల్లు' జులై 24న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా, అందులో పవన్ నటనపై డైరెక్టర్లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి స్పందించాడు.

తాజాగా, పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని ఎంతగానో ప్రశంసించాడు. ఈ సినిమా క్రిష్ కలల ప్రాజెక్ట్ అని అన్నాడు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా క్రిష్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత నిర్మాత కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. అయితే ఇప్పుడీ సినిమా, పవన్ కల్యాణ్ నటనపై క్రిష్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ...