India, Oct. 25 -- పర్సనల్​ లోన్​ రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే, రీఫైనాన్సింగ్ అనేది పాత లోన్​లను తీర్చుకునేందుకు తీసుకునే కొత్త పర్సనల్​ లోన్​.

సాధారణంగా.. ఈ కింది సందర్భాలలో రుణగ్రహీతలు రీఫైనాన్సింగ్‌ను ఎంచుకుంటారు:

మెరుగైన రుణ నిబంధనలు కావాలనుకున్నప్పుడు. రుణ కాలపరిమితిని పొడిగించుకోవాలనుకున్నప్పుడు. తక్కువ వడ్డీ రేటు వద్ద లోన్ పొందాలనుకున్నప్పుడు. లోన్​ రీఫైనాన్సింగ్ ఎప్పుడు చేస్తారు? రీఫైనాన్సింగ్‌ను సాధారణంగా కింది పరిస్థితుల్లో చేస్తారు:

మొత్తం వడ్డీ భారం తగ్గించడానికి: మీ మొత్తం వడ్డీని తగ్గించడం ద్వారా కొంత కాలక్రమేణా డబ్బు ఆదా చేయాలని మీరు అనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. ఉదాహరణకు, మీరు అసలు రుణం తీసుకున్నప్పటి నుంచి మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే, సౌకర్యవంతమైన నిబంధనలపై ఇంకో లోన్​ పొ...