భారతదేశం, జూన్ 17 -- కారణం ఏదైనా, ఇటీవలి కాలంలో లోన్​లు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు కూడా సరళమైన ప్రాసెస్​తో వెంటవెంటనే రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, చాలా మంది సరైన సమయానికి లోన్​లు తిరిగి చెల్లించకపోతున్నారు. ఫలితంగా, వారిపై అధిక ఆర్థిక భారం పడుతోంది. మరీ ముఖ్యంగా, అధిక వడ్డీ రేట్లు ఉండే పర్సనల్​ లోన్​ విషయంలో ఇది కనిపిస్తోంది. మరి, మీరు కూడా పర్సనల్​ లోన్​ తీసుకుని సమయానికి తీర్చలేకపోతున్నారా? అయితే ఇది మీరు కచ్చితంగా చదవాలి. లోన్​ పేమెంట్స్​ని మేనేజ్​ చేసి, అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నిపుణులు చెబుతున్న కొన్ని సింపుల్​ స్ట్రాటజీలను చూడండి..

1. మీ చెల్లింపు షెడ్యూల్‌ను అర్థం చేసుకోండి..

పర్సనల్​ లోన్​ విషయంలో ముందు మీ ఈఎంఐ స్ట్రక్చర్​ని పూర్తిగా అర్థం చేసుకోండి. మీ రుణ కాలవ్యవధి, గడువు తేదీ, ఈఎ...