భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఫంకీ'తో థియేటర్లకు రాబోతున్నాడు విష్వక్ సేన్. వరుస ఫ్లాప్ ల తర్వాత అతను చేసిన కామెడీ మూవీ ఇది. ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

ఒక్క హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోల్లో విష్వక్ సేన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా, కొత్త ప్రయోగాలు చేసినా అతనికి మాత్రం సక్సెస్ దక్కడం లేదు. ఇప్పుడు కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీతో ఆ నిరీక్షణకు ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నాడు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

ఖమ్మంలో నిర్వహించిన ఫంకీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ మాట్లాడాడు. తన కెరీర్ లోని బ్యాడ్ టైమ్ గురించి ప్రస్తావించాడు. ''లైఫ్ లో కొన...