Hyderabad, జూన్ 16 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన వెబ్ సిరీస్ పంచాయత్. ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ను నిర్మించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) గతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన వెబ్ సిరీస్ చూసేయండి.

2019లో తొలిసారి పంచాయత్ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పంచాయత్ సెక్రటరీ ఫులేరా అనే గ్రామంలో పడే ఇబ్బందులు, ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసిపోయే తీరు, అక్కడి రాజకీయాలను నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారు.

ఇందులో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్, మంజు దేవిగా నీనా గుప్తా, ప్రధాన్ జీగా రఘుబీర్ యాదవ్, ప్రహ్లాద్‌గా ఫైసల్ మాలిక్, వికాస్‌గా చందన్ రాయ్, బనరాకస్‌గా భూషణ్ కుమ...