భారతదేశం, ఆగస్టు 17 -- అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్ నగరంలో రద్దీగా ఉండే ఓ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. చిన్నగా మెుదలైన వివాదం తర్వాత.. ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో నైట్‌క్లబ్‌లో రాత్రిపూట జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో కొందరు దుండగులు ఉన్నారని తెలుస్తోంది. బ్రూక్లిన్‌లోని క్రౌన్ హైట్స్ పరిసరాల్లోని టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ నైట్ క్లబ్ వద్ద తెల్లవారుజామున 3:30 గంటలకు ముందు వివాదం జరిగింది. ఆ తర్వాత కొందరు దుండగులు తమ దగ్గర ఉన్న గన్స్‌తో కాల్పులు జరిపి ముగ్గురు వ్యక్తులను చంపారు.

న్యూయార్క్ నగరంలో జరిగిన భయంకరమై...