భారతదేశం, ఫిబ్రవరి 12 -- చరిత్రలో పరిచయం అక్కర్లేని అతికొద్ది మంది మహోన్నత వ్యక్తుల్లో అబ్రహం లింకన్ ఒకరు. అమెరికా 16వ అధ్యక్షుడిగా సేవలందించిన లింకన్.. బానిసత్వ సంకెళ్లను తెంచడంలోనూ, అంతర్యుద్ధం నుంచి దేశాన్ని ఐక్యంగా ఉంచడంలోనూ వీరోచిత పాత్ర పోషించారు. 1809 ఫిబ్రవరి 12న కెంటకీలో జన్మించిన ఆయన.. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులకు, యువతకు ఆదర్శప్రాయులు.

నేటి 'కోట్ ఆఫ్ ది డే' (Quote of the Day) కోసం 1850 ప్రాంతంలో ఒక లా లెక్చర్ (న్యాయశాస్త్ర ప్రసంగం) కోసం లింకన్ రాసుకున్న గమనికల నుంచి ఒక స్ఫూర్తిదాయక వాక్యాన్ని తీసుకున్నాం. అదే.. "నేడు చేయగలిగే ఏ పనిని కూడా రేపటికి వాయిదా వేయకండి." (Leave nothing for tomorrow which can be done today).

అబ్రహం లింకన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన అంతర్యుద్ధ సమయంలో ఆ...