భారతదేశం, నవంబర్ 14 -- రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సిద్దమైంది. రాష్ట్రాభివృద్ధికి ఈ రెండు రోజుల సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దేశ, విదేశాలకు చెందిన ప్రముఖుల ఈ రెండు రోజుల సదస్సుకు హజరు కానున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులు ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అలాగే వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థలకు చెందిన ఛైర్మన్లు, ప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారు. 50కు పైగా దేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హజరయ్యే అవకాశం కన్పిస్తోంది.

వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు చెందిన CXOలకు రాష్ట్ర ప్రభ...