భారతదేశం, డిసెంబర్ 15 -- నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ సినిమాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ట్రెండింగ్ లో మిగతా సినిమాల కంటే టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి. ఇందులో దుల్కర్ సల్మాన్ కాంత నుంచి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ టాప్-10 లిస్ట్ పై ఓ లుక్కేయండి.

దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కాంతతో మరోసారి ప్రేక్షకుల మధ్య తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. తమిళ చిత్రం కాంత నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ఒక పాత చలనచిత్ర యుగం కథను చెబుతుంది. దీనిలో హీరో, డైరెక్టర్ మధ్య ఈగోను చూపించారు.

రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ తెలుగు మూవీ లో ఆమె నటన తనకెంతో నచ్చిందని జాన్వీ కపూర్ చెప్పింది. ఈ సినిమాను చూడమని ప్రేక్షకులను కోరింది జాన్వీ కపూర్. ఇది గత వారం నెట్‌ఫ్లిక్...