భారతదేశం, డిసెంబర్ 24 -- గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు బుధవారం (డిసెంబర్ 24) ఉదయం సరికొత్త రికార్డు శిఖరాలను అధిరోహించాయి. దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్​లో బుధవారం ఉదయం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.42 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,469 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. మరోవైపు వెండి ధరల దూకుడు చూస్తే కళ్లు చెదరాల్సిందే! మార్చ్​ సిల్వర్ కాంట్రాక్టులు దాదాపు 2 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,23,742 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధర తొలిసారి ఔన్సుకు 4,500 డాలర్లు దాటింది. స్పాట్​ సిల్వర్​ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది. ఫలితంగా స్పాట్​ సిల్వర్​ వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నట్టు అయ్యింది.

అమెరికా- వెనుజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ ద...