భారతదేశం, ఏప్రిల్ 26 -- అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్/ నీట్ యూజీ 2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే 4న నిర్వహించనుంది. ఈ పరీక్షకు సిటీ ఇంటిమేషన్​ స్లిప్స్​ని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేయగా, neet.nta.nic.in లో అడ్మిట్ కార్డులను జారీ చేయనుంది.

పరీక్ష సమాచార బులెటిన్ ప్రకారం, నీట్​ యూజీ 2025 అడ్మిట్ కార్డులను మే 1, 2025 నాటికి neet.nta.nic.in విడుదల చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్టులో ఆఫ్​లైన్​లో ఈ నీట్​ 2025 పరీక్ష జరుగుతుంది.

ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ నోటిఫికేషన్​లో అడ్మిట్ కార్డులకు భిన్నంగా డాక్యుమెంట్ ఉందని సంస్థ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడానికి మాత్రమే సిటీ స్లిప్స్​ పనికొస్తాయని స్పష్టం చ...