Andhrapradesh, మే 7 -- ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1620 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. జిల్లాల వారీగా వీటిని రిక్రూట్ చేస్తారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుండగా. జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. ఆఫీస్ సబార్డినెట్ పోస్టులకు ఏడో తరగతి ఉండగా.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. పూర్తి వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
Published by HT Digital Content S...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.