భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) తన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల (అలుమ్నీ) కోసం ఒక భారీ అవకాశాన్ని ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి రెండో మెగా ఆన్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు వెల్లడించింది. యూనివర్సిటీలోని క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ (సీపీసీ) ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది.

ఈ ఇగ్నో మెగా క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​.. ఫిబ్రవరి 25, 2026న దిల్లీలోని మైదాన్ గర్హిలో ఉన్న ఇగ్నో క్యాంపస్‌లోని బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటల కల్లా రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.

జనవరిలో నిర్వహించిన డ్రైవ్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన దృష్ట్యా, విద్యార్థుల కెరీర్ మార్గాలను సుగమం చేసేందుకు ఈ రెండో విడతను ఇగ్నో తలపెట్టింది...