Hyderabad, మే 9 -- నిపా వైరస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేరళ. కేరళలో నిఫా వైరస్ బారినపడి అప్పట్లో ఎంతో మంది మరణించారు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిపా వైరస్ గురించి ఆందోళన కూడా తగ్గింది.
కానీ ఇప్పుడు మళ్లీ నిపా వైరస్ కలకలం రేగుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఒక మహిళ లో నిపా వైరస్ లాంటి లక్షణాలు కనిపించాయి. ఆమె ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆ జిల్లాలో మళ్లీ కలవరం మొదలైంది.
ఈ మహిళ మలప్పురం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందినది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకున్న లక్షణాలు నిపా వైరస్ లక్షణాలలాగే కనిపించాయి. జిల్లా ఆరోగ్య అధికారులు దగ్గరుండి ఆమెను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎటువంటి అధికారిక ధ్రువీకరణను ఇవ్వలేదు. రోగి నమూనాలను పరీక్ష కోసం జాతీయ ప్రయోగశాలకు పంపించినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.