భారతదేశం, ఆగస్టు 26 -- నిన్నటి వరకు రూ. 1950 లెవల్స్​ దగ్గర ట్రేడ్​ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేరు ధర.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 975 వద్ద కొనసాగుతోంది. ఇంత భారీ వ్యత్యాసాన్ని చూసి షేరు హోల్డర్లు ఆందోళన చెందే అవకాశం ఉంది. అయితే, దీనికి కారణం బోనస్ షేర్ల కోసం ఈ స్టాక్ 'ఎక్స్-డేట్'లోకి మారడమే!

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత నెలలో తమ త్రైమాసిక ఫలితాలతో పాటు బోనస్ షేర్లను కూడా ప్రకటించింది. దీని ప్రకారం. షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు లభిస్తాయి. అంటే, ప్రతి ఒక్క షేరుకు అదనంగా ఒక బోనస్ షేరు వస్తుంది. ఈ బోనస్ షేర్లను పొందేందుకు అర్హులైన షేర్‌హోల్డర్లను గుర్తించడానికి రికార్డు తేదీని ఆగస్ట్​ 26, 2025గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు బోనస్ షేర్లను పొంద...