భారతదేశం, ఫిబ్రవరి 7 -- హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దట్టమైన పొగ అలుముకోవటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో మంటలు రావటంతో. కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో సీజ్‌ చేసిన పలు కంప్యూటర్లు కూడా కాలిపోయాయి.

ఉదయం 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా. వెంటనే బయటికి వచ్చారు. ఆఫీస్ బాయ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహ...