భారతదేశం, ఫిబ్రవరి 8 -- నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం ఉదయం అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక సమాచారం కాలిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఘటనపై TGFSL డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
TGFSL డైరెక్టర్ పేరిట విడుదలైన ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.... ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో ఓ ఉద్యోగి పొగను గమనించాడు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు స్మోక్ అలారం యాక్టివ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదం కారణంగా కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ తో పాటు కొన్ని ఇతర సదుపాయాలకు మాత్రమే స్వల్ప నష్టం వాటిల్లింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.