భారతదేశం, ఫిబ్రవరి 8 -- నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక సమాచారం కాలిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఘటనపై TGFSL డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

TGFSL డైరెక్టర్ పేరిట విడుదలైన ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.... ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో ఓ ఉద్యోగి పొగను గమనించాడు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు స్మోక్ అలారం యాక్టివ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదం కారణంగా కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌ తో పాటు కొన్ని ఇతర సదుపాయాలకు మాత్రమే స్వల్ప నష్టం వాటిల్లింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు...