భారతదేశం, ఫిబ్రవరి 20 -- తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల మార్గాలను ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడానికి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చూట్టారు. సిబ్బంది వారానికి నాలుగు రోజులు ఉదయం 7.00 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి కార్యాలయాలలో అందుబాటులో ఉంటారు. జలమండలి, బస్తీ బాట కార్యక్రమం శుక్రవారం(ఫిబ్రవరి 20, 2026) ప్రారంభం అవుతుంది.

పరిష్కరించాల్సిన సమస్యలలో లీకేజీలు, తాగునీటి సరఫరాలో తక్కువ ప్రెజర్, నీటి పైపులైన్ల నిర్వహణ, డీసిల్టింగ్, నీటి వృథా, మ్యాన్‌హోల్స్, నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం, తాగునీటి నాణ్యతతోపాటుగా ఇతర సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా వర్షపు నీటి సేకరణ గుంతలు, ఇంజెక్షన్ బోర్‌వెల్‌ల గురించి ప్...