భారతదేశం, మే 19 -- గుంటూరు - తిరుపతి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం.. కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అదే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్. దీని పనులు వేగవంతం అయ్యాయి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దర్శి, పొదిలి వరకు రైల్వే లైన్ పనులు ముగింపు దశకు వచ్చాయి. ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభం కావాల్సి ఉండటంతో.. పనులను వేగవంతం చేశారు.

ఈ కొత్త లైన్‌లో భాగంగా.. కనిగిరి నియోజకవర్గంలో మూడు రైల్వే స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. యడవల్లి, కనిగిరి, గార్లపేట స్టేషన్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్.. ప్రకాశం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని దర్శి, కనిగిరి, పొదిలి ప్రజలు ఈ రైలు మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కనిగిరి, పామూరు మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్తుం...