భారతదేశం, ఫిబ్రవరి 15 -- బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' చిత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో 'రెహ్మాన్ డకైత్'గా అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆయన స్వాగ్, డ్యాన్స్, ఎక్స్‌‌ప్రెషన్స్‌కు మంత్రముగ్ధులయ్యారు.

అయితే, ఈ పవర్ ఫుల్ పాత్రను ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆఫర్ చేశారని, కానీ ఆయన ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వార్తలను కొట్టిపారేశారు. "కచ్చితంగా లేదు. రెహ్మాన్ డకైత్ పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కానీ, అటువంటి అద్భుతమైన పాత్రను చేసి ఉంటే బాగుండేదని నాకూ అనిపించింది" అని నాగార్జున పేర్కొన్నారు.

అక్షయ్ ఖన్నా నటన...