భారతదేశం, డిసెంబర్ 21 -- బాక్సాఫీస్​ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న ధురంధర్​ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రముఖ యూట్యూబర్​, పొలిటికల్​ కామెంటేటర్​ ధృవ్​​ రాఠీ! ఇది ఒక తప్పుడు 'ప్రాపగాండా' అని, వాస్తవాలు- కల్పితాలను మిళితం చేసి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాను తీశారని మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్​ ఛానెల్​లో తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

పాకిస్థాన్​లో ఒక భారత స్పై చేసే సాహసాల ఆధారంగా రూపొందిన సినిమా ఈ ధురంధర్​. ఇందులో రణ్​వీర్​ సింగ్​ నటించాడు. ఆదిత్య ధార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై చాలా మంది ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. కానీ సినిమా థీమ్​, చెప్పిన విధానాన్ని ఇంకొందరు తప్పుబడుతున్నారు. ఫలితంగా ధురంధర్​పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇందులోకి ధృవ్​ రాఠీ కూడా ఎంట్రీ ఇచ్చారు.

"ఏది వాస్తవ...