భారతదేశం, మే 3 -- భారత ఎంట్రీ లెవల్​ బైక్​ సెగ్మెంట్​లో హీరో మోటోకార్ప్ ప్రాడక్ట్స్​కి మంచి డిమాండ్​ ఉంది. వీటిల్లో హీరో హెచ్​ఎఫ్​ 100 ఒకటి. ఇక ఇప్పుడు, ఈ మోడల్​పై సంస్థ ఒక అప్డేట్​ ఇచ్చింది. కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తన లైనప్​ని అప్డేట్ చేస్తున్న ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హెచ్ఎఫ్ 100లో కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చౌకైన ధరకు, భారీ మైలేజ్​ని ఇస్తున్న ఈ బైక్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో మోటోకార్ప్​కి చెందిన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్​ ఈ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ఇప్పుడు ఓబీడీ -2బీ కంప్లైన్స్​కి అనుగుణంగా అప్డేట్​ అయ్యింది. ఈ అప్డేటెడ్​ హెచ్ఎఫ్ 100 ధర రూ .60,118 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), పాత వెర్షన్ కంటే కేవలం రూ .1,100 ఎక్కువ!

హీరో మోటోకార్ప్​ మాత్రమే కాదు, దేశంలో ఎంట్రీ లెవల్​లో లభిస్తున్న చౌక...