భారతదేశం, ఫిబ్రవరి 8 -- పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర వసతి గృహంలో 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయని, వారిని త్వరగా మారేడుమిల్లి, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించామని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.

శనివారం ఉదయం అల్పాహారం తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వివరించారు. హాస్టల్‌ను వెంటనే తనిఖీ చేసి, మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు నివేదించారు. విరేచనాల లక్షణాలు కనిపిస్తున్న వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పరిశీలించేందుకు హాస్టల్ నుండి ఆహారం, నీటి నమూనాలను సేకరించారు.

ఈ సంఘటన...