భారతదేశం, ఫిబ్రవరి 9 -- మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ దుల్కర్ సల్మాన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న దుల్కర్.. ప్రస్తుతం పవన్ సాదినేని ('దయా' వెబ్ సిరీస్ ఫేమ్) దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామాలో నటిస్తున్నారుడు. ఆ సినిమా పేరు 'ఆకాశంలో ఒక తార'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ఓటీటీ (OTT) హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.

ఈ డీల్ ద్వారా నిర్మాతలు సినిమా బడ్జెట్‌లో దాదాపు 60 శాతం మొత్తాన్ని ఇప్పటికే రికవర్ చేశారని తెలుస్తోంది. దుల్కర్ క్రేజ్, ఎమోషనల్ కంటెంట్ నచ్చడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ ఆకాశంలో...