భారతదేశం, డిసెంబర్ 17 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ నుంచి సహన సహన అనే సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. బుధవారం (డిసెంబర్ 17) మేకర్స్ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్పెయిన్ లోని అదిరిపోయే లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించడం విశేషం.

ది రాజా సాబ్ మూవీ నుంచి ఇప్పటికే ఓ టీజర్, ఫస్ట్ సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సెకండ్ సింగిల్ కూడా వచ్చేసింది. సహన సహన అంటూ సాగిపోయే మెలోడీ ఇది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. ప్రభాస్, నిధి అగర్వాల్ పై ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులో ప్రభాస్ తన సింపుల్ స్టెప్స్ తో అదరగొట్టాడు. తన స్టైల్, గ్రేస్ తో ప్రభాస్ చాలా అందంగా కనిపించాడు.

ఈ సహన సహన సాంగ్ యూట్యూబ్ లో కేవలం రెండున్నర నిమిషాలే ఉండగా.. స్పాటిఫైలాంటి మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ లో మాత్రం నాలుగున్...