భారతదేశం, ఫిబ్రవరి 22 -- ది కేరళ స్టోరీ 2 సినిమాపై వివాదాలు ఆగడం లేదు. రోజురోజుకూ కాంట్రవర్సీ ముదురుతోంది. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ది కేరళ స్టోరీ 2 సినిమాపై కౌంటర్ వేశాడు. ఈ మూవీకి కామాఖ్య నారాయణ్ డైెరెక్టర్. విపుల్ విపుల్ అమృత లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'ది కేరళ స్టోరీ 2 '. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో ఓ సీన్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ ముస్లిం కుటుంబం ఓ అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు. దీంతో కాంట్రవర్సీ కలకలం రేగింది.

'ది కేరళ స్టోరీ 2' సినిమాపై ప్రకాష్ రాజ్ కౌంటర్ వైరల్ గా మారింది. ఆయన తన ఎక్స్ ఖాతాలో పోర్క్, బీఫ్, చేపలు, వెజ్ అన్నం వంటకాల చిత్రాలను సోషల్ మీడ...