భారతదేశం, డిసెంబర్ 21 -- దక్షిణాఫ్రికాలో గన్ కల్చర్ మరోసారి పెను విషాదాన్ని సృష్టించింది. జోహన్నెస్‌బర్గ్ శివార్లలోని ఒక టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో ఇలాంటి సామూహిక మారణకాండ జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి! ఫలితంగా స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు.

జోహన్నెస్‌బర్గ్ నగరానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెక్కర్స్‌దాల్ అనే ప్రాంతంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. నిరుపేదలు ఎక్కువగా నివసించే, బంగారు గనులకు సమీపంలో ఉండే ఒక చిన్న బార్ (టావెర్న్) వద్ద ఈ కాల్పులు జరిగాయి.

ఈ దాడి వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు.

"గుర్తుతెలియని వ్యక్తులు వీధుల్లో నడుస్తున్న వారిపై వ...