భారతదేశం, మే 7 -- కొన్ని మలయాళ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍‍లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సబ్‍స్క్రిప్షన్ లేకున్నా వీటిని ఉచితంగా చూసేయవచ్చు. వాటిలో కోల్డ్ కేస్ (Cold Case) మూవీ కూడా ఉంది. ఈ మలయాళ క్రైమ్ హారర్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ట్విస్టులతో థ్రిల్లింగ్‍గా ఈ చిత్రం సాగుతుంది. వివరాలు ఇవే..

కోల్డ్ కేస్ సినిమా తెలుగు డబ్బింగ్‍‍లో తెలుగు ఫిల్మ్ నగర్ అనే యూట్యూబ్‍ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఆ ఛానెల్‍లో ఉచితంగా చూడొచ్చు.

కోల్డ్ కేస్ చిత్రం 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళంలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత తెలుగు డబ్బింగ్‍తో ఆహా ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్‍లోనూ తెలుగు డబ్బింగ్‍తో అందుబాటులో...