Hyderabad, సెప్టెంబర్ 29 -- మార్వెల్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆ సినిమా బజ్ క్రియేట్ చేసిన చేయకపోయినా థియేటర్లకు యావరేజ్‌గా ఆడియెన్స్ వెళ్తుంటారు. ఇంత క్రేజ్ ఉన్న మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఒకటి థండర్‌బోల్ట్స్*.

ఇదివరకు మార్వెల్ సినిమాల్లో సూపర్ హీరోలకు విలన్స్‌గా ఉన్నవాళ్లు ఒక టీమ్‌గా ఏర్పడి ప్రజలను కాపాడే సూపర్ హీరోలుగా అదరగొట్టే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ఈ థండర్‌బోల్ట్స్. ఎరిక్ పియర్‌సన్ రచించిన ఈ సినిమాకు జేక్ స్క్రీయర్ దర్శకత్వం వహించారు.

ఫ్లొరెన్స్ ఫగ్, లెవిస్ పుల్‌మ్యాన్, వ్యాట్ రస్సెల్, డేవిడ్ హార్బర్, సెబాస్టియన్ స్టాన్, హన్నా జాన్-కమెన్, జులియా లూయిస్ కీలక పాత్రలు పోషించిన థండర్‌బోల్ట్స్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో ఓటీటీ...