భారతదేశం, మే 4 -- మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వాయిదా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చాలా ఏళ్లకు వీరి జోడీ రిపీట్ అవుతోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు కావడంతో ఓ సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది మూవీ టీమ్.

విశ్వంభర చిత్రం నుంచి త్రిష ఫస్ట్ లుక్‍ను టీమ్ రివీల్ చేసింది. ఆమె బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో అవని పాత్రలో త్రిష కనిపించనున్నారని వెల్లడించింది. విషెస్ చెప్పింది.

అద్భుతంగా ఉండే అవని పాత్రను త్వరలో చూస్తారంటూ విశ్వంభరను ప్రొడ్యూజ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్ర...