భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) మరో ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' (D/o Prasad Rao Kanabadutaledhu). ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఆ విశేషాలు ఏంటో ఇక్కడ చూడండి.

ఈ మధ్య సౌత్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన జీ5.. వరుసగా తెలుగు ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'D/o ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే ఉత్కంఠభరితమైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.

ఈ వెబ్ సిరీస్‌లో విలక్షణ నటుడు రాజీవ్ కనకాల ప్...