Telangana, జూన్ 4 -- తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ అమలుకు సిద్ధమైంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు 'నేతన్నకు భరోసా' పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
ఈ స్కీమ్ అమలు కోసం 48.00 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సంవత్సరానికి 2 విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందనుంది. ఈ స్కీమ్ కింద 40 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కు సంబంధించి వివరాలను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జూన్ 2వ తేదీన జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇందుకోసం రూ.48.00 కోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.