Telangana,hyderabad, జూలై 1 -- ఈ విద్యా సంవత్సరం(2025-26) ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులే ఉంటాయని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.
బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022-25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది కూడా అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి
మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను పెంచుతుంటారు. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. హేతుబద్ధంగా ఫీజుల పెంపును సిఫార్సు చేయడం కోసం ఒక కమిటీని కూడా నియమించింది
ఇందులో భాగంగా 2025-28 (మూడేండ్లు) బ్లాక్ పీరియడ్లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదనలు స్వీకరించింది. కాలేజీల వారీగా ప్రత్యక్ష వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.