Telangana,hyderabad, జూలై 1 -- ఈ విద్యా సంవత్సరం(2025-26) ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులే ఉంటాయని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.

బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022-25 బ్లాక్‌ పీరియడ్‌ ఫీజులే ఈ ఏడాది కూడా అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి

మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచుతుంటారు. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. హేతుబద్ధంగా ఫీజుల పెంపును సిఫార్సు చేయడం కోసం ఒక కమిటీని కూడా నియమించింది

ఇందులో భాగంగా 2025-28 (మూడేండ్లు) బ్లాక్‌ పీరియడ్‌లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదనలు స్వీకరించింది. కాలేజీల వారీగా ప్రత్యక్ష వ...