భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఓటింగ్ ప్రయత్నాలు, అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ, అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణలు జరిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

తుది పోలింగ్ శాతం 73.01గా ఎన్నికల సంఘం అంచనా వేసింది. మెుదట 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. 2,996 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 62.55 శాతంగా...