భారతదేశం, నవంబర్ 15 -- నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు 60 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా సైంటిఫిక్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబోరేటరీ టెక్నీషియన్‌, ల్యాబోరేటరీ అటెండెంట్‌ పోస్టులను రిక్రూట్ చేస్తారు. మొత్తం 13 రకాల పోస్టులున్నాయి. పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యా అర్హతల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 30 మార్కులకు రాత పరీక్ష, విద్యా అర్హతల్లో సాధించిన ఉత్తీర్ణతకు 70 శాతం మార్కులుంటాయి.

ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతంది. ఈ గడువు డిసెంబర్ 17, 2025 సాయంత్రం ...