భారతదేశం, నవంబర్ 1 -- హీరోగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సోదరుడు చైతు (చైతన్య) జొన్నలగడ్డ కూడా నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హిట్ 3, భామా కలాపం 2 వంటి సినిమాల్లో నటించారు. చైతు జొన్నలగడ్డ నటుడిగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి.

"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే, ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌మెంట్ చేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

నటుడు...