భారతదేశం, నవంబర్ 30 -- టీజీ టెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగానే పెరిగింది. శనివారం సాయంత్రం సమయానికి 2,26,956 దరఖాస్తులు రాగా. అర్ధరాత్రి వరకు మరికొంతమంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంఖ్య 15 వేల నుంచి 20 వేల మధ్య ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్ - 2025కు 1.83 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1.37 లక్షల మందే పరీక్ష రాశారు. అయితే ఈసారి మాత్రం. 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం టెట్‌ తప్పనిసరి కావడంతో చాలా మంది ఈ పరీక్షను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి వీరు కూడా చాలా మంది దరఖాస్తు చేశారు. వీరి సంఖ్య 70 వేలుగా ఉంది.

డిసెంబర్ 27వ తేదీ...