Telangana, జూన్ 4 -- తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు వచ్చేశాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష జూన్ 8,9 తేదీల్లో జరగనుంది.ప్రతి రోజూ రెండు సెషన్లు ఉంటాయి. రెండు రోజుల్లో మొత్తం నాలుగు సెషన్లు జరుగుతాయి.
జూన్ 8,9 తేదీల్లో తెలంగాణ ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్) విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ ఉంటుంది.
తెలంగాణ ఐసెట్ - 2025 ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న ఫలితాలను ప్రకటిస్తారు.
Published by HT Digital Content ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.