Telangana,hyderabad, జూలై 17 -- రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో వర్షాలు లేకపోవటంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

వర్షాలు కురవకపోవడంతో స్థానికంగా ఉత్పత్తి తగ్గింది. దీంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ దిగుమతులు తరచుగా ఆ ప్రాంతాలలో వర్షాల కారణంగా దెబ్బతింటాయి. గత కొన్ని వారాలుగా టమోటాలు, బీన్స్, మిర్చి వంటి కూరగాయల ధరలు 30-50 శాతం పెరిగాయని మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి.

మార్కెట్ లెక్కల ప్రకారం. గత కొన్ని నెలలుగా కిలో టమోటా ధర రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30-40కి చేరింది. బీన్స్ ప్రస్తుతం కిలో రూ.60-70 నుంచి రూ.90-100కు, మిర్చి (పచ్చిమిర్చి) కిలో రూ.60-70 మధ్య ఉండగా. రూ.100 వైపు పరుగులు తీస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

అధిక ధరల క...