Telangana,andhrapradesh, జూన్ 3 -- తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం. ఇవాళ(జూన్ 03)కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

జూన్ 4వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మ...