Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం రుసుం లేకుండా ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది.

టీజీ సీపీగెట్ - 2025 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుందని అధికారులు తాజాగా ప్రకటించారు. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

టీజీ సీపీగెట్ పరీక్షల నిర్వహణపై ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 4వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన...