భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉరి వేసి చంపి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌, ప్రమీల భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్త ప్రవీణ్ కు తెలియడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

శుక్రవారం కూడా ప్రవీణ్, ప్రమీల మధ్య జరిగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరి వేసి హత్య చేసింది. ఆ తర్వాత ప్రవీణ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కోడలి తీరుపై అనుమానం వచ్చిన ...