Andhrapradesh,telangana, మే 22 -- వేసవి పూర్తి కాకముందే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్దిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా కేరళలోకి ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఐఎండీ అంచనాల మేరకు. ఈసారి ముందుగానే రుతుపవనాల ప్రవేశం ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి.
అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులిటెన్ ప్రకారం.. రాబోయే 2 - 3 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, దానికి అనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.