భారతదేశం, సెప్టెంబర్ 16 -- కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఐఎఫ్) కింద తెలంగాణలో రూ.868 కోట్ల పెట్టుబడితో 34 రోడ్లు, వంతెన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు, మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

రాష్ట్రంలో రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశంగా ఈ అడుగు పడిందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ఈ భారీ నిధులతో ఆర్థిక పురోగతికి ఊతమివ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటిస్తూ.. ఈ ప్రాజెక్టులు మొత్తం 422.36 కిలోమీటర్ల పొడవునా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు. 'ఈ పనుల ద్వారా కనెక్టివిటీని గణనీయంగా పెంచడం, రాష్ట్ర రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. తెలంగాణలో రోడ్డ...