భారతదేశం, జూన్ 7 -- బ్యాంకు కస్టమర్స్​కి అలర్ట్​! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025 జూన్ 7, శనివారం బక్రీద్ కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సాధారణంగా ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో బ్యాంకులు తెరిచి ఉండగా, రెండు- నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. కాగా జూన్ 7 అనేది ఈ నెలలో మొదటి శనివారం. కాబట్టి బక్రీద్​కు ఆర్బీఐ సెలవు ప్రకటించని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయని గమనించాలి.

ఈద్ అల్-అధా అని కూడా పిలిచే బక్రీద్.. ఇస్లాంను అనుసరించేవారికి రెండొవ పవిత్రమైన పండుగ. ఈ ఏడాది భారతదేశంలో జూన్ 7 శనివారం జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన పండుగ ఇస్లాంలో చాలా ముఖ్యమైనది. ఇది ఇస్లామిక్ మూన్​ క్యాలెండర్ పన్నెండొవ, చివరి నెల అయిన ధూల్ హిజ్జా 10వ రోజున వస్తుంది.

అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, ...